అనిల్‌ రావిపూడికి కరోనా.. ఎఫ్‌-3 షూటింగ్‌ వాయిదా

17 Apr, 2021 21:30 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉ‍న్నారు. అనిల్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనిల్‌ దర్శకతంలో తెరకెక్కుతున్న ఎఫ్-‌3 మూవీ కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ ఇటీవల మైసూరులో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే డైరెక్టర్‌ అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో షూటింగ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల అనిల్‌ రావిపూడి ఈ షూటింగ్‌ గురించి సోషల్‌ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ భారీ షూటింగ్‌ షెడ్యూల్‌లో అధిక భాగం హీరో వెంకటేష్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాని కోసం దృశ్యం-2 షూటింగ్‌ పూర్తి చేసుకున్న వెంకటేశ్‌ కూడా డేట్స్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎఫ్‌-3లో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌, తమన్నా నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఎఫ్‌-3 తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది. 
చదవండి: ‘ఇష్క్’ హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు