డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడికి కరోనా నెగెటివ్‌

28 Apr, 2021 14:55 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈరోజు (ఏప్రిల్‌ 28 )న చేసిన టెస్టు రిపోర్టులో తనకు కరోనా నెగిటివ్‌ వచ్చిందని, ఈ సందర్భంగా తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి ఓ పోస్టును షేర్‌ చేస్తూ.. 'ఈ నెల 13న నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరికి పర్సనల్‌గా ఫోన్‌ చేసి కరోనా టెస్టు చేయించుకోవాలని కోరాను.

వైద్యుల సూచనలు పాటిస్తూ నేను కూడా క్వారంటైన్‌ అయిపోయాను. ఈరోజు చేసిన టెస్టులో నెగిటివ్‌ అని వచ్చింది. చాలా బెటర్‌గా ఫీల్‌ అవుతున్నాను' అని పేర్కొన్నారు. ఇక ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరారు. ఇక ప్రస్తుతం ఆయన ఎఫ్‌-3 సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. అనిల్‌ రావిపూడికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం వాయిదా వేశారు. ప్రస్తుతం ఈయనకు నెగిటివ్‌ రావడంతో ఈ మూవీ త్వరలోనే మళ్లీ పట్టాలెక్కనుంది. 

చదవండి : యాంకర్‌ అనసూయను అవమానించిన 'ఆహా'!
Allu Arjun: అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు