చాలా ఇష్ట‌మైన‌ వ్య‌క్తిని కోల్పోయా : డైరెక్ట‌ర్ అట్లీ

26 Apr, 2021 09:28 IST|Sakshi

డైరెక్ట‌ర్ అట్లీ కుటుంబంలో విషాదం‌‌

ఎమోష‌న‌ల్ ట్వీట్ చేసిన డైరెక్ట‌ర్ అట్లీ 

చెన్నై : ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అట్లీ తాత‌య్య సౌందరా పాండియన్ కన్నుమూశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అట్లీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొంటూ ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయ‌న‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మా తాత ఎం. సౌంద‌రా పాడియ‌న్ చ‌నిపోయారు. పూడ్చ‌లేని న‌ష్టమిది..దీన్ని ఎలా అధిగమించాలో తెలియ‌డం లేదు. ఆయ‌న నా జీవితంలో ఎంతో ముఖ్య‌మైన వ్య‌క్తి. నేను ఆయ‌న్ని ఎంత‌గానో ప్రేమిస్తాను. తాత మీరే నా రోల్‌మోడ‌ల్‌, ల‌వ్ యూ, మిస్ యూ..మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి అంటూ అట్లీ ట్వీట్ చేశారు.

ఇది చూసిన పలువురు ప్ర‌ముఖులు స‌హా అభిమానులు అట్లీక కుటుంబానికి సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక తొలిచిత్రం రాజా రాణితో బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న అట్లీ ఆ త‌ర్వాత ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు. టాప్ హీరోల‌తో సినిమాలు చేస్తూ త‌మిళ ఇండ‌స్ర్టీలో మోస్ట్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం అట్లీ బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌తో ఓ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. తెలుగులోనూ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయ‌‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే తార‌క్‌కు  స్క్రిప్ట్ వినిపించార‌ని, త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియ‌ల్ అప్‌డేట్ రావాల్సి ఉంది.‌

చ‌ద‌వండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెం అయినా సిగ్గుండాలి' 
ఆస్కార్‌ 2021: దక్షిణ కొరియాకు తొలి ఆస్కార్‌ నటి‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు