లైన్‌ వినగానే ఓకే అన్నారు

29 Mar, 2021 00:36 IST|Sakshi
బక్కియరాజ్‌ కణ్ణన్, ‌కార్తీ, రష్మికా మందన్నా

‘‘తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. వీటిలో ఉన్న కమర్షియాలిటీ ఇష్టం. దర్శకులు రాజమౌళిగారికి పెద్ద అభిమానిని. ‘బాహుబలి’ని లెక్కలేనన్నిసార్లు చూశాను’’ అన్నారు బక్కియరాజ్‌ కణ్ణన్‌ . కార్తీ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా బక్కియరాజ్‌ కణ్ణన్‌  దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సుల్తాన్‌ ’. ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా బక్కియరాజ్‌ మాట్లాడుతూ– ‘‘తమిళంలో శివ కార్తీకేయన్‌  నటించిన ‘రెమో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. ఈ చిత్రం తెలుగులోనూ మంచి సక్సెస్‌ సాధించింది.

దర్శకుడిగా నా రెండో చిత్రం ‘సుల్తాన్‌ ’. ఇందులో రొబోటిక్స్‌ ఇంజినీర్‌ పాత్రలో కార్తీ కనిపిస్తారు. జస్ట్‌ స్టోరీ లైన్‌  విని, ఆయన ఓకే చెప్పేశారు. తన వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండే మనస్తత్వం కలిగిన హీరో వందమంది వ్యక్తులతో జీవనం సాగించాల్సి ఉంటుంది. వీరి వల్ల హీరో జీవితం ఎలా ప్రభావితం అయ్యింది అన్నదే ‘సుల్తాన్‌ ’ కథ. కార్తీ, రష్మికా మధ్య సన్నివేశాలు క్యూట్‌ అండ్‌ ఫ్రెష్‌గా ఉంటాయి. ‘కేజీఎఫ్‌’ సినిమాలో రామచంద్రరాజు చేసిన గరుడ క్యారెక్టర్‌ చూసి, ఈ సినిమాలో నెగటివ్‌ రోల్‌కు ఆయన్ను సెలక్ట్‌ చేశాం. సినిమా అన్నివర్గాలవారూ చూసే విధంగా ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు