కొత్త సినిమా షూటింగ్‌లో చిరంజీవి

3 Dec, 2021 05:25 IST|Sakshi

చిరంజీవి ఫుల్‌ స్పీడ్‌లో ఉన్నారు. ‘ఆచార్య’, ‘బోళాశంకర్‌’ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన తాజాగా కొత్త సినిమా చిత్రీకరణలో గురువారం జాయిన్‌ అయ్యారు. ఈ సినిమాకు బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవికి సీన్‌ వివరిస్తున్న ఓ ఫొటోను బాబీ షేర్‌ చేసి, ‘‘చిరంజీవి అన్నయ్య తొలిరోజు షూటింగ్‌లో మాతో జాయిన్‌ అయ్యారు. కొంచెం నెర్వస్‌గా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది’’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్థర్‌ ఏ విల్సన్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: జీకే మోహన్, సీఈఓ: చెర్రీ. 

మరిన్ని వార్తలు