‘రిపబ్లిక్‌’ ఫస్ట్‌లుక్‌: 74 ఏళ్లుగా ఆ భ్రమలోనే ఉంటున్నాం

25 Mar, 2021 10:28 IST|Sakshi

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రిపబ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్‌ పొలిటికల్‌ మూవీని తెరకెక్కించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఇటీవల చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం రిపబ్లిక్‌ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ మెగా పవర్‌ స్టార్‌ రామచరణ్‌ తేజ్‌ను విడుదల చేశాడు. ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా ట్విటర్ వేదికగా ఈ పోస్టర్‌ షేర్‌ చేశాడు.   

‘డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు’ అంటూ స్కెచ్‌ వేసిన తేజ్‌ ఫొటోను ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రంలో తేజ్‌ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు కిలక పాత్రలు పోషిస్తుండగా  రాహుల్‌ రామకృష్ణ, బాక్సర్‌ దిన వంటి తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావులు కలిసి నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

చదవండి: 
ఇంటివాడు కాబోతున్న సాయ్‌ తేజ్‌.. మేలో పెళ్లి! 

మరిన్ని వార్తలు