Director Son Suicide: తాగొద్దని తండ్రి మందలించడంతో ఆత్మహత్య

20 Mar, 2022 14:33 IST|Sakshi

Director Girish Malik Son Commits Suicide: హోలీ పండగ నాడు ప్రముఖ దర్శకుడు, నటుడు గిరీశ్‌ మాలిక్‌ ఇంట తీవ్రి విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. శుక్రవారం గిరీశ్‌ మాలిక్‌ తనయుడు మన్నన్‌(17) ప్రమాదవశాత్తూ ఐదో అంతస్థు నుంచి కింద పడి మరణించాడని 'టొర్బాజ్‌' నిర్మాత రాహుల్‌ మిత్ర ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం మద్యం మత్తులో మన్నన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం హోలీ ఆడుతూ మద్యం సేవించిన మన్నన్‌ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర కూడా తాగుతుండటంతో తండ్రి గిరీశ్‌ అతడిని మందలించాడు. 

చదవండి: Girish Malik: దర్శకుడి ఇంట విషాదం, ఐదో అంతస్థు నుంచి..

తాగుడు మానేయాలని చెప్పడంతో మన్నన్‌ కోపంతో తండ్రితో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు మన్నన్‌ తల్లితో దురుసుగా ప్రవర్తించడంతో ఆమె కోపంతో వంట గదిలోకి వెళ్లిపోయింది. గిరీశ్‌ కొడుకుతో గొడవ అనంతరం తన రూంకు వెళ్లిపోయాడు. ఇక మన్నన్‌ కూడా 5వ అంతస్తులోకి తన గదికి వెళ్లినట్లు సమాచారం. పైకి వెళ్లాక కోపంతో మరింత రగిలిపోయిన మన్నన్‌ కిటికి తలుపులు పగలగొట్టి కిందికి దూకేసినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: అలా చేస్తే ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్‌ కండిషన్‌!

పెద్ద శబ్ధం వినిపించడంతో గిరీశ్‌ బయటకు వచ్చి చూడగా మన్నన్‌ రక్తం మడుగులో కనిపించాడు. ఇక హుటాహుటిన అతడిని ముంబైలోని కొకిలాబెన్‌ అంబానీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మన్నన్‌ తుదిశ్వాస విడిచాడు. శనివారం సాయంత్రం సిద్ధార్థ్‌ ఆసుపత్రిలో అతడి మృతదేహానికి పోస్ట్‌మార్ట్‌ జరగగా.. నేడు ముంబైలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా గిరీజ్‌ 2013లో 'జల్‌' సినిమాతో దర్శకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 'టొర్బాజో', 'మాన్‌ వర్సెస్‌ ఖాన్‌' సినిమాలు అతడికి మంచి పేరు తీసుకువచ్చాయి.

మరిన్ని వార్తలు