Balakrishna: ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. అఫీషియ‌ల్ ప్రకటన వచ్చేసింది

10 Jun, 2021 12:50 IST|Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. బాలయ్య బర్త్‌డే(జూన్‌ 10)సందర్భంగా ఆయన నటించబోయే 107వ సినిమా పై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి  గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‏తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను దర్శకుడు గోపిచంద్ మలినేని తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసుకున్నారు.‘క్రాక్‌’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్‌ మలినేని ఓ మాస్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే . ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్‌ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.


చదవండి:

బాబాయ్‌కి అబ్బాయిలు ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ బర్త్‌డే విషెస్‌
Akhanda: బాలయ్య బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. నవ్వుతూ నటసింహం అలా..

మరిన్ని వార్తలు