Director Jijesh MV: వినూత్నంగా ‘ఓడ విట్టి చుడలామా’

13 May, 2022 14:39 IST|Sakshi

చైన్నై సినిమా: వినూత్న కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రం 'ఓడ విట్టి చుడలామా'. ఎవరివన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై వినీత్‌ మోహన్, ప్రకాష్‌ వేలాయుధం కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది. జీజేష్‌ ఎంవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమీర్‌ సుహీల్, గోపిక అనే నవ జంట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన వినీత్‌ మోహన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. 

వినూత్న కథ, కథనాలతో వినోదాన్ని మేళవించి ప్రతీకారం ప్రధానాంశంగా రూపొందిస్తున్న చిత్రమని దర్శకుడు తెలిపారు. త్వరలో చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పా రు. దీనికి ప్రకాష్‌ వేలాయుధం ఛాయాగ్రహణం, అశ్విన్‌ శివ దాస్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి: మహేశ్‌ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్‌గా నిలిచిన కంగనా

మరిన్ని వార్తలు