ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: డైరెక్టర్‌ జొన్నలగడ్డ శ్రీనివాస్‌

21 May, 2022 08:10 IST|Sakshi

జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆటో రజిని’. శ్రీనివాస్‌ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కీలక పాత్ర చేస్తున్నారు. కాగా ‘ఆటో రజిని’ యూనిట్‌ గురువారం సాయంత్రం నందిగం సురేష్‌ ఆధ్వర్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను వైఎస్‌ జగన్‌కి చూపించారు.

శ్రీనివాస్‌ జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘‘ హై ఓల్టేజ్‌ లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆటో రజిని’. ఇటీవల విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నందిగం సురేష్‌ అన్న, హరి కాంబినేషన్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను ఫైట్‌ మాస్టర్‌ కణల్‌ కన్నన్‌ నేతృత్వంలో చిత్రీకరించాం. జూన్‌ 10 నుంచి తర్వాతి షెడ్యూల్‌ విజయవాడలోనే ప్రారంభిస్తాం. మా సినిమా షూటింగ్‌కి సహకరించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. 

మరిన్ని వార్తలు