K Vishwanath: చిరంజీవి సలహా.. తనవల్ల కాదని చెప్పిన కె విశ్వనాథ్

3 Feb, 2023 16:22 IST|Sakshi

కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రతి సినిమా ఆణిముత్యమే. అంతా దర్శక ప్రతిభతో సినిమాలు తెరకెక్కించారు.  తెలుగు చిత్రపరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి ఆయన తన సినిమాలకు తీసుకున్న పారితోషికం తీసుకునేవారు. అప్పట్లో ఆయన సినిమాలకు ఎంత పారితోషికం ఇచ్చేవారో ఓసారి పరిశీలిద్దాం. 

అలా అయితే కోట్ల బంగ్లా ఉండాల్సింది

కె విశ్వనాథ్ మొదటి నుంచీ కొన్ని సిద్ధాంతాలకు పరిమితమైపోయారు.  వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకోకుండా ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమానే చేసేవారు. 'శంకరాభరణం' తర్వాతవచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని ఉంటే.. అప్పటికే సగం హైదరాబాద్ కొనేసేవాడినని ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. ఆయన చేసినవన్నీ దాదాపు రిస్కీ ప్రాజెక్టులే. అందుకే ఏనాడూ భారీ పారితోషికాలు కావాలని డిమాండ్ చేసేవారు కాదట. వాళ్లు ఎంత ఇవ్వగలిగితే అంతే తీసుకునేవారట. ఆయన జీవితం మొత్తం అలానే సాగిపోయింది.  ఆయన సక్సెస్ రేటు, చేసిన సినిమాల సంఖ్యను బట్టి చూస్తే కచ్చితంగా ఫిల్మ్ నగర్‌లో కోట్లు విలువ చేసే బంగ్లా ఉండాల్సిందే. 

ఆ విషయంలో చాలా బాధ పడేవారు 

ఎందుకంటే ఇప్పుడున్నవాళ్లతో పోల్చు కుంటే చాలా బాధగా ఉంటుందని అనేవారు. అది మానవ నైజమని.. ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు కూడా ఎందుకు తీసుకోలేదు? అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటూందని చెప్పేవారు. మళ్లీ వెంటనే మనసుకు సర్ది చెప్పుకునేవారు. ఒక్కసారి ఆ డబ్బు మాయలో పడిపోతే సృజతనాత్మకత పక్కకు వెళ్లిపోతుందని ఆయన అభిప్రాయం. అందుకే ఓసారి చిరంజీవి ఆయనతో ఇలా అన్నారట. మేమంతా అండగా ఉంటాం. సొంతంగా సినిమా చేసుకోండి అన్నారట. అప్పుడు కె విశ్వనాథ్ తన వల్ల కాదని చెప్పేశారు. 

ఆయన అత్యధిక పారితోషికం ఎంతో తెలుసా? 

అప్పట్లో కె.విశ్వనాధ్ తీసుకున్న పారితోషికంపై అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.  ఈ విషయంపై ఆయనను ప్రశ్నిస్తే.. అది మీరడగకూడదు. నేను చెప్పకూడదని నవ్వుతూ సమాధానమిచ్చేవారు.  నిజంగానే ఆయన పారితోషికం ఎప్పుడే గానీ ఎక్కువగా తీసుకునేవారు కాదట. ఒక్కోసారి ఆయన సినిమాల్లో పాటలకు ఆయనే నృత్య దర్శకత్వం చేయాల్సి వచ్చేది. దానికి అదనంగా పారితోషికం తీసుకోవచ్చు కానీ ఎప్పుడే కానీ అలా చేయలేదట. అయితే అప్పుడు అడిగి ఉండాల్సిందని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుందని ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. ఆయన తన అనుభవాలతో పరిశ్రమలో అడగకపోతే అడగనట్టే ఉంటుంది. తొమ్మిది గంటలకు రావాల్సిన కారు రాకపోతే వెంటనే ఆటోలో వెళ్లేవారట. నాతో పాటు ఉన్న దర్శకులు ఎంత తీసుకుంటున్నారో కూడా ఎప్పుడేగానీ ఆరా తీసేవారు కాదట. మనకు భగవంతుడు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తాడని గట్టిగా నమ్మేవారు కె విశ్వనాథ్. అందుకే ఆయన కళామతల్లి బిడ్డగా కళాతపస్వి బిరుదు పొందారని అనిపిస్తోంది. 


 

మరిన్ని వార్తలు