పాన్‌ ఇండియా ప్రాజెక్టు : సోనూసూద్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..

20 May, 2021 15:49 IST|Sakshi

సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించే బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కరోనా కాలంలో రియల్‌ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్న వారిని దేవుడిలా ఆదుకుంటూ, ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తూ ఆపద్భాందవుడిలా మారాడు. గతేడాది లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చడంతో ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తన పనులతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే రియల్‌ లైఫ్‌తో పాటు రీల్‌ లైఫ్‌లోనూ సోనూసూద్‌ని హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆయన సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించారు. అయితే ఇకపై హీరోలా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ పాన్‌ఇండియా సినిమాలో సోనూసూద్‌ హీరో పాత్ర పోషించనున్నారట. ఇందకోసం ఇప్పటికే డైరెక్టర్‌ క్రిష్‌ ఓ మంచి కథను సిద్ధం చేశారని, సోనూసూద్‌కి కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్‌ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తవగానే సోనూసూద్‌ ప్రాజెక్టును సెట్స్‌ పైకి తీసుకెళ్తారట. ఇదే నిజమైతే త్వరలోనే వెండితెరపై కూడా సోనూను హీరోగా చూడాలన్న చాలా మంది కల నెరవేరినట్లే.

చదవండి : భవిష్యత్తు ప్రధాని సోనూసూద్‌.. స్పందించిన నటుడు
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు