Krishna Vamsi : 'ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ రియల్‌ లైఫ్‌లో బ్యాడ్‌ సన్‌ని'

28 Mar, 2023 10:55 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన తొలిరోజు నుంచే హిట్‌ తెచ్చుకున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కృష్ణవంశీ మార్క్‌ మరోసారి కనిపించిదంటూ సినీ ప్రముఖులు పొడగ్తలు వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో రంగమార్తాండ సక్సెస్‌ గురించి కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్‌  చేశారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి వస్తున్న ఆదరణ గతంలో చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతంలో నేను చేసిన సినిమాల కంటే రంగమార్తాండ ప్రత్యేకం. చిరంజీవి లాంటి దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. సోసల్‌ మీడియాలోనూ ఊహించని రెస్పాన్స్‌ లభిస్తోంది.

రిలీజ్‌కు ముందు అంతగా ప్రచారం చేయకున్నా మంచి కంటెంట్‌ చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రంగమార్తాండతో మరోసారి రుజువు అయ్యింది. ఇది 'ఇది మన అమ్మానాన్నల కథ' అని క్యాప్షన్‌ ఇవ్వడంతో ఆడియెన్స్‌ మరింత కనెక్ట్‌ అయ్యారు. అయితే సినిమాకి, నా పర్సనల్‌ లైఫ్‌కి చాలా తేడా ఉంది.

మా నాన్న చాలాకాలం క్రితమే చనిపోయారు. మా అమ్మ మాత్రం నాతోనే ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను మా పేరెంట్స్‌తో అంతగా కనెక్టెడ్‌గా లేను.ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. రియల్‌ లైఫ్‌లో బ్యాడ్‌ సన్‌ని. ఇంట్లోవాళ్ల  విషయానికి వస్తే.. ఎవరితోనూ అంత క్లోజ్‌గా మాట్లాడను'' అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు