ఇదొక ఆధ్యాత్మిక అనుభవం

17 Jun, 2022 05:56 IST|Sakshi

– కృష్ణవంశీ

‘‘నా జీవితంలో నేను సంపాదించిన అతి పెద్ద అమూల్యమైన ఆస్తి (సంగీత దర్శకుడు ఇళయరాజాని ఉద్దేశించి). ఇది ఆ భగవంతుని ఆశీర్వాదం. గొప్ప విషయాలు ఏదో ఒక టైమ్‌లో ముగిసిపోతాయి. అలాగే,, మా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఎంతో సంతృప్తికరంగా, విజయవంతంగా పూర్తయింది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం’’ అని దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్‌ చేశారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతదర్శకుడు. ఆయన ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా జరిగిన నేపథ్య సంగీతం గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్ని పేర్కొని, ఇళయరాజాతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు కృష్ణవంశీ. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్, శివాత్మికా రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు.

మరిన్ని వార్తలు