ఆది సాయికుమార్‌ 'టాప్‌గేర్‌' టీజర్‌ విడుదల చేసిన మారుతి

3 Dec, 2022 17:01 IST|Sakshi

ఈ ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు టాప్ గేర్ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్‌ చేపట్టిన మేకర్స్‌ తాజాగా సినిమా టీజర్‌ను వదిలారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కార్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. విజువల్‌ ఎలిమెంట్స్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. 

మరిన్ని వార్తలు