సైన్స్ ఫిక్షన్ డ్రామా "రామ్ అసుర్" ట్రైలర్‌ విడుదల

14 Nov, 2021 16:24 IST|Sakshi

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా పీనట్ డైమండ్". మాస్‌ ఆడియోన్స్‌కు రీచ్‌ అయ్యేలా టైటిల్‌ను ''రామ్‌ అసుర్‌'' గా మార్చిన సంగతి తెలిసిందే. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై వెంక‌టేష్ త్రిప‌ర్ణ  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌19న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి, బుచ్చిబాబు, బెల్లంకొండ సురేష్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొని మూవీ టీంకు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. మారుతి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు