ఈ సినిమా కథ విని షాకయ్యాను: సునీల్‌

2 Sep, 2022 00:46 IST|Sakshi
సునీల్, అంజి, ధన్‌రాజ్, మారుతి

– దర్శకుడు మారుతి  

‘‘హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఓ డేరింగ్‌ స్టెప్‌. ఇక్కడే మొదటి విజయం సాధించింది ఈ చిత్రం. సునీల్, ధన్‌ రాజ్‌ లాంటి మంచి నటులతో జి. నాగేశ్వరరెడ్డిగారు ఇలాంటి థ్రిల్లర్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో కెమెరామేన్‌ ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘బుజ్జి.. ఇలారా’.

రూపా జగదీష్‌ సమర్పణలో ఎస్‌ఎన్‌ఎస్‌ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పి, జి. నాగేశ్వరరెడ్డి టీమ్‌ వర్క్‌ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు మారుతి హాజరయ్యారు. ధన్‌రాజ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు అసలైన స్టార్స్‌ నిర్మాతలే. నాపై నమ్మకంతో నాలుగు కోట్లు ఖర్చుపెట్టారు. ఈ కథకు నేనే కరెక్ట్‌ అని నమ్మి, నాతో సినిమా చేసి అండగా నిలబడ్డారు నాగేశ్వరరెడ్డిగారు’’ అన్నారు.‘‘ఈ సినిమా కథ విని షాకయ్యాను. మంచి సందేశం ఉంది’’ అన్నారు సునీల్‌. ‘‘ఈ సినిమాతో దర్శకత్వం ఎంత కష్టమో తెలిసింది’’ అన్నారు అంజి. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు నిర్మాతలు.   

మరిన్ని వార్తలు