ప్రభాస్‌-మారుతి  రెగ్యులర్‌ షూటింగ్‌ అప్పుడే

22 Oct, 2022 12:40 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్‌ హీరోయిన్స్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రం నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి రీసెంట్‌గా లుక్‌ టెస్ట్‌ నిర్వహించారట మారుతి. వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా స్టార్ట్‌ చేయాలని చిత్రయూనిట్‌ భావిస్తోంది.

అయితే ఈ వారంలోనే రెగ్యులర్‌ షూట్‌ జరిపేందుకు అంతా సిద్ధం చేశారట మారుతి. ఫస్ట్‌ షెడ్యూల్‌లో వారం రోజులు మాత్రమే ప్రభాస్‌ పాల్గొంటారట. హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే తాత–మనవడి కథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని టాక్‌. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు