మెగాస్టార్‌ తదుపరి చిత్రం ఆ డైరెక్టర్‌తోనే !

7 Aug, 2020 11:58 IST|Sakshi

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. దీని తర్వాత సాహో లాంటి పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారనే వార్తలు వినిపించాయి. ఇదిలా వుండగా  ఆ సినిమా స్క్రిప్టు విషయంలో సుజిత్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చక, ఆ ప్రాజక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో చిరంజీవి తదుపరి ఏం చిత్రాలు చేయబోతున్నారనే చర్చలు జరుగుతున్నాయి. ఆచార్య సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉంటుందనీ, స్క్రిప్టు కూడా సిద్ధమైందని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త షికారు చేస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారట. అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో మెహర్‌ రమేష్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం మెహర్ రమేశ్ దీనిపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో చిరంజీవి నటించే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వాస్తవానికి వేదాళం చిత్రాన్ని పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలనుకున్నారని ఆ మధ్య టాక్‌ వినిపించింది. 

చదవండి: బర్త్‌డే వేడుకలు: అభిమానులకు మహేష్‌ రిక్వెస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా