డైరెక్టర్‌ పరశురాం చేతుల మీదులుగా ‘కరణ్‌ అర్జున్‌’ ఫస్ట్‌లుక్‌

18 Apr, 2022 16:42 IST|Sakshi

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా,  పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్. ఈ నేపథ్యంలో కంటెంట్‌ను మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న చిత్రం రోడ్ థ్రిల్ల‌ర్  ‘క‌ర‌ణ్ అర్జున్‌’. మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్‌లు నిర్మిస్తున్నారు. తాజాగా  ఈ చిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ విడుదల చేశాడు.  

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ... ‘‘క‌ర‌ణ్ అర్జున్‌’ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు. ప్ర‌జంట్ ట్రెండ్‌కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ కూడా ఎంతో ప్యాష‌న్‌తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు’’ అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ.. ‘మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు.  ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్‌లో  పాకిస్థాన్ బార్డర్‌లో ఎంతో రిస్క్ తీసుకుని  మా సినిమా  షూటింగ్ చేశాం.  

మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి.  ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు. సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం’ అన్నారు. కాగా ఈ మూవీలో అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్ట‌ర్ సునీత్ , అనిత  చౌదరి, రఘు . జి,  జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 

మరిన్ని వార్తలు