దేశభక్తి నేపథ్యంలో...

23 Sep, 2023 04:47 IST|Sakshi

సూర్య అయ్యలసోమయాజుల హీరోగా, మిహిరామ్‌ వైన తేయ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘రామ్‌’ (ర్యాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌). ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపికా ఎంటర్‌టై¯Œ మెంట్‌–ఓఎస్‌యం విజన్‌పై దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ని డైరెక్టర్‌ పరశురామ్‌ విడుదల చేశారు.

‘‘వాస్తవ ఘటనలను ఆధారం చేసుకుని, దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘రామ్‌’. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో హీరో చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. మా సినిమా ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది’’ అని మేకర్స్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్‌ అయ్యంగార్, కెమెరా: ధారన్‌ సుక్రే.  

మరిన్ని వార్తలు