ఆ స్టార్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో ‘అ2’ సీక్వెల్‌ ఆగిపోయింది: డైరెక్టర్‌

18 May, 2021 21:34 IST|Sakshi

వైవిధ్యమైన కథతో సినిమాలను అందించడంలో యంగ్‌ డైరెక్టర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది‌. డిఫరెంట్‌ జానర్‌తో ‘అ!’ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత జీవిత రాజశేఖర్ హీరోగా అతడు తెరకెక్కించిన ‘కల్కీ’ చిత్రం కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ ప్లేతో పాటు విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ఇటీవల ప్రశాంత్ తెరకెక్కించిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ను సంపాదించుకుంది.

తెలుగులో జాంబీ జానర్‌లో వచ్చిన తొలి చిత్రం కావడంతో ఈ సినిమా కొత్త థ్రిల్ అందించింది. తన డెబ్యూ చిత్రం అ!కు సీక్వెల్ తీస్తున్నట్లు ప్రశాంత్‌ వర్మ అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దీనిపై ఆయన ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. తాజాగా ఈ సీక్వెల్‌ ఆగిపోయినట్లు ఆయన ప్రకటించాడు. అ2 స్క్రిప్ట్ ఎప్పుడో పూర్తయిందని, దీనిని ఓ బాలీవుడ్ స్టార్‌తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాల‌ని అనుకున్నట్లు చెప్పాడు. దీనికి ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అంతా ఓకే అయిందనుకుంటుండగా అతడు షాక్‌ ఇచ్చాడని, ఆ స్టార్‌ ఈ మూవీ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతున్నట్లు చెప్పడంతో ‘అ2’ సినిమా వెన‌క్కి వెళ్లిందని ఆయన వివరణ ఇచ్చాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు