Hanuman Movie: హనుమాన్‌ నుంచి పోస్టర్‌ రిలీజ్‌.. దసరాకి అసలైన గిఫ్ట్‌

23 Aug, 2022 13:26 IST|Sakshi

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో హీరో తేజ సజ్జా నటిస్తున్న చిత్రం హనుమాన్‌. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ పతాకంపై  కె. నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం మరో అప్‌డేట్‌ వచ్చింది. 

నేడు(మంగళవారం) హీరో తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో ఆయనకి విషెస్‌ చెబుతూ స్పెషల్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.ఈ సినిమా నుంచి అసలైన గిఫ్ట్ ఈ దసరాకి అందిస్తానని  డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రానికి  అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంజమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్‌ కుమార్ నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు