నీలి రంగు తెరపై రాధేశ్యామ్‌ మేకింగ్‌ వీడియో

19 Nov, 2020 20:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బాహుబలి ప్రభాస్‌ తాజా చిత్రం రాధేశ్యామ్‌ మేకింగ్‌ వీడియోను దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ గురువారం షేర్‌ చేశారు. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫీల్మ్‌ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ గురువారం మేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నీలిరంగు స్ర్కీన్‌లో ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి సినిమాలతో పాన్‌ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నా వారందరిని ‘రాధేశ్యామ్‌’ మేకింగ్‌ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఉన్నది కొద్ది సెకండ్లే అయినా బ్లూ స్ర్కీన్‌పై సరికొత్తగా తీసిన ఈ‌ మేకింగ్‌ వీడియోకు నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ‘డార్లింగ్’‌ ప్రభాస్‌ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయనిపిస్తోంది. (చదవండి: ముప్పై కోట్లతో సెట్‌)

A post shared by Radha Krishna Kumar (@director_radhaa)

అయితే గత నెల ఇటలీలో షూటింగ్‌ జరుపుకున్న ‘రాధేశ్యామ్’‌ చిత్ర బృందం ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది.  ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్‌ సీన్‌లన రూపొందిస్తున్నారు. అయితే  క్లైమాక్స్‌ సీన్‌ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కు వర్క్‌ చేస్తుండటం విశేషం. యూరప్‌ నేపథ్యంలో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని భారీ యాక్షన్‌ సీన్‌లు‌ ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో ప్రభాస్‌ పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. అంతేగాక సచిన్‌ ఖేడేకర్‌, ప్రియదర్శి, భాగ్యశ్రీ, మురళీ శర్మ, సత్యన్‌ శివకూమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ షూటింగ్‌ పూర్తిగానే ప్రభాస్ తర్వాతి చిత్రం ‘అదిపురుష్‌’ షూటింగ్‌ పాల్గొననున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: ‘రాధేశ్యామ్‌’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా