Ram Gopal Varma Tweet: దేవుడికి నా రిక్వెస్ట్.. అలా జరిగితేనే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

16 Nov, 2022 18:44 IST|Sakshi

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వార్త వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతోంది. ప్రియురాలిని అతి కిరాతకంగా చంపి 35 ముక్కలుగా చేశాడంటే అతను ఎంత నరరూప రాక్షసుడో అర్థమవుతోంది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ  ఘటన దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది.

(చదవండి: బస్సులో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు: నటి)

ఈ నేపథ్యంలో తాజాగా ఈ దారుణ ఘటనపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. యువతి దారుణ హత్యను ప్రస్తావిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్టంతో అరికట్టలేమంటూ దేవునికి విచిత్రమైన రిక్వెస్ట్ పెట్టారు. ఆర్జీవీ ట్వీట్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

ట్వీట్‌లో ఆర్జీవీ ప్రస్తావిస్తూ.. 'ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్టం అనే భయంతో అరికట్టలేము .. కానీ చనిపోయాక బాధితుల ఆత్మలు  తిరిగి వచ్చి హంతకులను చంపితే వాటిని కచ్చితంగా అరికట్టవచ్చు. దయచేసి ఈ విషయాన్ని భగవంతుడు పరిగణనలోకి తీసుకుని ఈ విధంగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ యువతి ఆత్మ విశ్రాంతి తీసుకోకుండా తిరిగి వచ్చి అతనిని 70 ముక్కలుగా కట్ చేయాలి.' అంటూ పోస్ట్ చేశారు. 

మరిన్ని వార్తలు