కరోనాపై ఆటం బాంబు పేల్చిన రామ్‌గోపాల్‌ వర్మ

14 Apr, 2021 23:35 IST|Sakshi

తనకు నచ్చిన విషయాన్ని ఏదైనా స్పష్టంగా చెప్పడంతో పాటు వ్యంగ్యంగా చెప్పడంతో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు సర్వసాధారణం. ఏది తోచితే అది ఆ అంశంపై స్పందించి సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయం చెబుతాడు. ఆయన్ను అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో ద్వేషించేవారు అంతకన్నా అధికంగా ఉంటారు. తాజాగా మరో అంశంపై ఆర్జీవీ స్పందించారు. వరుసగా అదే అంశంపై రోజంతా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. కరోనా ఆటం బాంబుగా పోల్చారు. దీంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ప్రకటించలేదు కానీ తీవ్ర ఆంక్షలు విధించిన విషయంపై స్పందించి ట్వీట్‌ చేశారు.

ఉగాది సందర్భంగా ప్రారంభమైన కుంభమేళాను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారు. కుంభమేళాను కరోనా ఆటం బాంబుగా సరిపోల్చారు. ఈ పేలుడుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని ప్రశ్నించారు. గుడ్‌బై ఇండియా, వెల్కమ్‌ కరోనా అంటూ ట్వీట్‌ చేశారు. కుంభమేళ నుంచి వచ్చినవారికి మాస్క్‌లే అవసరం లేదని.. వాళ్లు ఇప్పటికే గంగలో మునిగి వైరస్‌ను వదిలేశారు అని పేర్కొన్నారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించిన నిషేదాజ్ఞలపై స్పందించారు. నేను దీనిని లాక్‌డౌన్‌ అని ఉద్దవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ట్వీట్‌ చేశారు. ‘దానికి ఇంకో పేరు పెడుతున్నా. బారసాల కార్యక్రమానికి అందరూ రండి. గిఫ్ట్‌లు తీసుకురావడం మర్చిపోవద్దు’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. కుంభమేళాలో 31 లక్షల మంది పాల్గొంటే వారిలో 26 మందికే పాజిటివ్‌ సోకిన వార్తపై కూడా ఆర్జీవీ స్పందించి ఓ పోస్టు చేశారు. ‘అయితే అందరికీ ఎలాంటి సమస్య లేదు. అందరం పార్టీ చేసుకుందాం’ అని తెలిపాడు.
 

మరిన్ని వార్తలు