‘చెరసాల’ రిలీజ్‌కు ముందే రెండో సినిమా షురూ

1 Nov, 2022 20:32 IST|Sakshi

సినీ ప్రేక్షకుల ఆలోచన మారింది. హీరో కాకుండా కంటెంట్‌ బాగుంటే చాలు ఆ సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్‌ డైరెక్టర్స్‌ డిఫరెంట్‌ కంటెంట్‌తో సినిమాలు చేస్తూ విజయం సాధిస్తున్నారు. దర్శకుడు రామ్ ప్రకాష్ గుణ్ణం కూడా ఓ కొత్త పాయింట్‌తో ‘చెరసాల’సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రెండో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఈ యంగ్‌  డైరెక్టర్‌. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం తాజాగా జరిగింది.

 ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో పాటు సన్నిహితులు విచ్చేశారు. ముఖ్య అతిధులుగా నమీరుద్దీన్ అహ్మద్, కతేరి అంజమ్మ , కట్ల భాగ్య లక్ష్మి, రైటర్ నరేందర్ రెడ్డి, కిషోర్, తెలుగు మహేంద్ర విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ..‘నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహిస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ను అందించే విధంగా సినిమా కోసం పనిచేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా లను వెండితెరపైకి తీసుకు వస్తాను’ అని అన్నారు.

మరిన్ని వార్తలు