డంపింగ్‌ యార్డులో మూవీ సెట్‌ వేశాం : డైరెక్టర్‌ 

4 Oct, 2022 15:23 IST|Sakshi

ముఖేష్‌ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్‌’. రవిచరణ్‌ దర్శకత్వంలో నమో క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్‌ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్‌’ తెరకెక్కిస్తున్నాం.

పూర్తిగా డంపింగ్‌ యార్డ్‌లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్‌ యార్డ్‌ సెట్‌ వేశాం. మా హీరో ముఖేష్‌ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్‌’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్‌ గుప్తా.

మరిన్ని వార్తలు