నాగార్జున ఏం తింటున్నారో: వర్మ

29 Aug, 2020 14:07 IST|Sakshi

సాక్షి, ముంబై: టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ ద్వారా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జున ఏం తింటున్నారో గానీ, ఇలా ప్రతీ పుట్టిన రోజుకు నవ మన్మధుడిగా తయారవుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (నాగ్‌ బర్త్‌డే : ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్)

"మీరు ఏమి తింటున్నారో నాకు తెలియదు, ఏ దేవుడుని ప్రార్థిస్తున్నారో..ఇంకేం చేస్తారో తెలియదు. కానీ ప్రతి పుట్టిన రోజుకి మీరు ఇంకా ఇంకా యంగ్ అయిపోతున్నారు..ఇలా అయితే కలకాలం ఇలాగే జీవించబోతున్నారు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు  ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదలపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు.  చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం షూటింగ్ కు రడీ అవుతున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కింగ్ నాగర్జున ఈ రోజు  61వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. టాలీవుడ్ హీరో హీరోయిన్లు,  దర్శక నిర్మాతలు, నటీనటులు,  ప్రముఖులతో పాటు పలువురు ఇతర రంగాల వారు కూడా  అభినందనలు తెలుపుతున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు