విజయానంద్‌కి మహానటి స్ఫూర్తి

28 Nov, 2022 05:43 IST|Sakshi
రిషికా శర్మ, నిహాల్, ఆనంద్‌ శంకేశ్వర్, సిరి ప్రహ్లాద

– రిషికా శర్మ

‘‘రెండున్నర సంవత్సరాల క్రితం ‘విజయానంద్‌’ సినిమా ప్రయాణం మొదలైంది. బయోపిక్స్‌లో తెలుగులో వచ్చిన ‘మహానటి’ వంటి సినిమా మళ్లీ రాదు. ఒకవిధంగా ‘విజయానంద్‌’ సినిమాకు
‘మహానటి’యే ఓ స్ఫూర్తి. దర్శకులు రాజమౌళిగారికి నేను పెద్ద అభిమానిని’’ అని డైరెక్టర్‌ రిషికా శర్మ అన్నారు. వీఆర్‌ఎల్‌ లాజిస్టిక్స్‌ అధినేత విజయ్‌ శంకేశ్వర్‌ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్‌’. నిహాల్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించారు. రిషికా శర్మ దర్శకత్వంలో వీఆర్‌ఎల్‌ ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ శంకేశ్వర్‌ తనయుడు డా.ఆనంద్‌ శంకేశ్వర్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్‌ 9న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో నిహాల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ–‘‘విజయ్‌ శంకేశ్వర్‌గారి పాత్ర చేయడం చాలా పెద్ద బాధ్యత. ‘విజయానంద్‌’అనేది మాకు సినిమా కాదు.. ఓ ఎమోషన్‌. ‘మహానటి’లో కీర్తీసురేష్‌గారి తరహా పెర్ఫార్మెన్స్‌ చేయాలనుకున్నాను. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. రాజమౌళిగారికి నేను బిగ్‌ ఫ్యాన్‌’’ అన్నారు. ‘‘రెండున్నర గంటల్లో ఈ కథను అద్భుతంగా చూపించిన రిషికాగారికి, బాగా నటించిన నిహాల్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు ఆనంద్‌ శంకేశ్వర్‌. నటీనటులు సిరి ప్రహ్లాద, భరత్, అనీష్‌ కురివిల్లా, యూఎఫ్‌ఓ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు