Major: మాకు అదో అగ్ని పరీక్ష!

2 Jun, 2022 08:23 IST|Sakshi

‘‘ఏ దర్శకుడైనా తన సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు చూడాలనే ఆశపడతాడు. భాషాపరమైన హద్దులను బ్రేక్‌ చేసే కథను మన దేశంలో ఎవరూ తీసినా అది ఇండియన్‌ సినిమాయే. అయితే కొన్నిసార్లు ఇది ఆ సినిమాను నిర్మించే నిర్మాతపై కూడా ఆధారపడి ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శశికిరణ్‌ తిక్క. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శశికిరణ్‌ తిక్క చెప్పిన విశేషాలు. 

‘మేజర్‌’ కంటెంట్‌కు దర్శకుడిగా నేనైతే న్యాయం చేయగలనని శేష్‌ అడిగారు. దీంతో సందీప్‌గారి గురించి పరిశోధన చేయడం స్టార్ట్‌ చేశాను. అప్పుడు నాకు సందీప్‌గారి క్యారెక్టర్‌ బాగా నచ్చింది. ఆయన మంచి మానవతావాది అని కూడా తెలుసుకున్నాను. సందీప్‌లాంటి వ్యక్తి గురించి అందరికీ తెలియాలని ‘మేజర్‌’ చేయడానికి అంగీకరించాను. 

► అడివి శేష్‌ మంచి యాక్టర్‌ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు కూడా. అయితే ‘మేజర్‌’ సినిమా విషయంలో ఎవరి క్రాఫ్ట్స్‌ వాళ్లం చూసుకున్నాం. ‘మేజర్‌’ బడ్జెట్‌ పెరిగింది. చాలెంజ్‌ అంతకంటే పెరిగింది.‘మేజర్‌’లో సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాం. ముఖ్యంగా మేం యాక్షన్‌లో కాస్త లిబర్టీ తీసుకున్నాం. 

‘మా దగ్గర్నుంచి ‘మేజర్‌’ టీమ్‌ చాలా సమాచారాన్ని తీసుకున్నారు. వీరు ఏం చేస్తున్నారు’ అనే సందేహం సందీప్‌గారి తల్లిదండ్రులకు వచ్చి ఉండొచ్చు. సో.. వారిని మెప్పించడం అనేది మాకు ఓ అగ్నిపరీక్ష. బెంగళూరులో సందీప్‌గారి అమ్మ నాన్నలకు సినిమా చూపించాం. వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 

► నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. నా నెక్ట్స్‌ సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలోనే చెబుతాను.      

మరిన్ని వార్తలు