క్రికెటర్‌తో డైరెక్టర్‌ శంకర్ కూతురు పెళ్లి

26 Jun, 2021 16:25 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కరోనా కారణంగా వీరి వివాహ వేడుకను నిరాడంబరం నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. పెళ్లి డేట్‌పై స్పష్టత లేదు. వృతిరీత్యా శంకర్‌ కూతురు ఐశ్యర్య డాక్టర్‌ కాగా రోహిత్‌ టీఎన్‌పీఎల్(తమిళనాడు ప్రీమియర్ లీగ్)లో క్రికెటర్ కావడం విశేషం.

ఇక రోహిత్‌ తండ్రి రామోదరన్‌ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్‌ టీంకు స్పాన్సర్‌ కూడా. అయితే గత మేలో శంకర్‌ తల్లి ముత్తు లక్ష్మీ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్‌. ప్రస్తుతం శంకర్‌ ఇండియన్‌ 2 మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో అపరిచితుడు రీమేక్‌ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: 
శవం ముందు నటి డ్యాన్స్‌, అవాక్కైన నెటిజన్లు
Monal Gajjar: హైదరాబాదీని అయిపోయా.. మోనాల్‌ ఆసక్తికర పోస్ట్‌
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్‌ హీరోయిన్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు