ఘనంగా శంకర్‌ కూతురి వివాహం, హాజరైన సీఎం

27 Jun, 2021 13:44 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వరుడు రోహిత్‌ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్‌ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్‌ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇదిలా వుంటే శంకర్‌ ప్రస్తుతం 'ఇండియన్‌ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో అపరిచితుడు రీమేక్‌ కూడా చేయనున్నట్లు భోగట్టా. 

చదవండి: క్రికెటర్‌తో డైరెక్టర్‌ శంకర్ కూతురు పెళ్లి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు