Director Shankar: డైరెక్టర్‌ శంకర్‌కు అరుదైన గౌరవం

7 Aug, 2022 09:35 IST|Sakshi

తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్‌. జెంటిల్‌మెన్‌తో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ముదల్‌వన్, బాయ్స్, శివాజీ, ఇండియన్, ఎందిరన్, ఐ, ఎందిరన్‌–2 ఇలా ఒక దానికి ఒకటి పూర్తి భిన్నంగా చిత్రాలు చేసి స్టార్‌ డైరక్టర్‌గా ప్రసిద్ధికెక్కారు. అలాగే సినీ దర్శకుడిగా 30 ఏళ్ల మైలురాయిను టచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వేల్స్‌ ఇంజినీరింగ్, రీసెర్చ్‌ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

శుక్రవారం పల్లావరంలోని వర్సిటీ ఆవరణలో 12వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, పతకాలను ప్రదానం చేశారు.

అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. అందులో దర్శకుడు శంకర్, అణు శాస్త్ర విజ్ఞాన కేంద్రం డైరక్టర్‌ అజిత్‌కుమార్‌ మొహతీ, భారతీయ క్రికెట్‌ క్రీడాకారుడు సురేష్‌ రైనా, నాటి జూన్‌ బ్లూ గ్రూప్‌ అధ్యక్షుడు విక్రమ్‌ అగర్వాల్‌ గౌరవ డాక్టరేట్‌ పురస్కారాలు అందుకున్నారు. ముందుగా వేల్స్‌ విశ్వవిద్యాలయం చైర్మన్‌ ఐసరి గణేష్‌ అతిథులకు స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు