మరోసారి రామ్‌చరణ్‌తో జతకట్టనున్న బాలీవుడ్‌ భామ!

21 May, 2021 21:30 IST|Sakshi

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో భారత సినీ పరిశ్రమకు చెందిన పులువురు స్టార్‌ నటీనటులు నటించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోం​ది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామా అలియా భట్‌ను తీసుకోవాలని శంకర్‌ చిత్ర బృందంతో చర్చించారని వినికిడి.

దీంతో డైరెక్టర్ శంకర్‌ టీం ఇటీవల ఆమెతో చర్చలు కూడా జరిపారనే వార్త ఫిలిం దూనియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉందట. ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పాటు బాలీవుడ్‌లో పలు సినిమాలకు సంతకం చేసిందట. ఇప్పటికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అలియా షూటింగ్‌ పార్ట్‌ ఇంకా పూర్తికాలేదు, దీనితో పాటు హిందీలో తాను సంతకం చేసిన పలు చిత్రాలు లైన్‌లో ఉన్నాయట. మరీ ఇంత బిజీ షెడ్యూల్‌లో అలియా శంకర్‌-చరణ్‌ ప్రాజెక్ట్‌కు ఒకే చేస్తుందో లేదో ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ అంతా ఒకే అయితే అలియాకు చరణ్‌తో ఇది రెండవ సినిమా అవుతుంది. కాగా డైరెక్టర్‌ శంకర్‌ తల్లి ముత్తు లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు