సిద్ధార్థ్ అడిగిమరి బావ క్యారెక్టర్ తీసుకున్నాడు : శశి

3 Aug, 2021 19:40 IST|Sakshi

‘నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా సినిమాకు పనిచేసే ఒక రచయితను నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే  ఆయన ఈ మధ్యే నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య చిన్న తమ్ముడు మంచి ఫ్రెండ్ అయ్యాడు. నా తమ్ముడి కంటే ఈ బావమరిది తోనే నేను ఎక్కువ చనువుగా ఉంటాను, అతను ఎవరు  చెప్పింది విన్నా వినకున్నా, నా మాట మాత్రం తప్పకుండా వింటాడు, కొడుకు, తమ్ముడు, ఫ్రెండ్ అన్నీ వాడే నాకు అని చెప్పాడు. ఆ రిలేషన్ నాకు గొప్పగా అనిపించింది. అప్పుడే ఒరేయ్ బామ్మర్ది సినిమా కథకు నా మనసులో ఆలోచన మొదలైంది’అన్నాడు దర్శకుడు శశి.

ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం‘ఒరేయ్‌ బామ్మర్థి’.సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన  ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్ లలో విడుదల కాబోతోంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శశి మీడియాతో మాట్లాడుతూ..  సివప్పు మంజల్ పచ్చై అనే పేరుతో తమిళ్ లో ఈ మూవీని రూపొందించాం. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాంతో డబ్ చేసి విడుదల చేస్తున్నాం. బిచ్చగాడు డబ్ వెర్షన్ తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలుసు. ఒరేయ్ బామ్మర్ది కథ సిద్ధార్థ్ కు చెప్పాక తనను బావమరిది క్యారెక్టర్ చేయమని అడిగాను. కానీ సిద్ధార్థ్ కు బావ క్యారెక్టర్ నచ్చి అది సెలెక్ట్ చేసుకున్నాడు. బావమరిది క్యారెక్టర్ లో జీవీ ప్రకాష్ కుమార్ ని తప్ప మరొకరు సెట్ కారు అనిపించింది. సిద్ధార్థ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్. జీవీ కూడా సూపర్బ్ గా యాక్ట్ చేశాడు. ఇందులో యాక్షన్ సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని అన్నాడు. 

మరిన్ని వార్తలు