ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ఇంట విషాదం

28 Nov, 2020 18:55 IST|Sakshi

చెన్నై: ప‌్ర‌ముఖ తెలుగు, త‌మిళ ద‌ర్శ‌కుడు శివ‌ తండ్రి జ‌య‌కుమార్ క‌న్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. జ‌య‌కుమార్‌ 400కు పైగా ల‌ఘు చిత్రాల‌కు డాక్యుమెంట‌రీ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు. ఆయ‌న తండ్రి వేల‌న్ కూడా అనేక సినిమాల‌కు నిర్మాత‌గా, స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌ని చేశారు. ఇక జ‌య కుమార్ చిన్న‌కొడుకు బాలా మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా రాణిస్తుండ‌గా పెద్ద‌కొడుకు శివ తొలుత‌ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించారు. (మరో విషాదం : కమెడియన్‌ కన్నుమూత)

తెలుగులో శ్రీరామ్‌, నేనున్నాను, మ‌న‌సు మాట విన‌దు, గౌత‌మ్ ఎస్ఎస్‌సీ, బాస్ వంటి సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు. త‌ర్వాత గోపీచంద్ శౌర్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. అలా శంఖం, దరువు సినిమాల‌ను తెర‌కెక్కించారు. కానీ టాలీవుడ్‌లో పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో త‌మిళ ఇండ‌స్ట్రీ మీద‌నే ఫోక‌స్ పెట్టారు. కార్తీ సిరుతాయ్, త‌రువాత హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు అందుకుని ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, ప్ర‌స్తుతం ఆయ‌న త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ హీరోగా న‌టిస్తున్న‌ 'అన్నాత్తే' చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మరిన్ని వార్తలు