దర్శకుడు స్వర్ణం కన్నుమూత

10 Jun, 2021 08:19 IST|Sakshi
దర్శకుడు స్వర్ణం భౌతిక కాయానికి  నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆరంభకాలంలో కథానాయకుడిగా నటించిన చిత్ర దర్శకుడు స్వర్ణం మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయన వయస్సు 88 ఏళ్లు. స్వర్ణం ప్రారంభదశలో మురసు పత్రికా సంస్థలో రచయితగా తన సేవలను అందించారు.

ఆ తరువాత దర్శకుడిగా అవతారమెత్తి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ అప్పట్లో కథానాయకుడిగా నటించిన ‘ఒరేరత్తం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కథ అందించడం గమనార్హం. కాగా స్థానిక కొట్టివాక్కంలో కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆయన.. వృద్ధాప్యం కారణంగా మంగళవారం కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి ముఖ్యమంత్రి స్టాలిన్, నటుడు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌ నివాళులు అర్పించారు. 

మరిన్ని వార్తలు