‘లిప్‌లాక్‌ సీన్స్‌ ఉన్నంత మాత్రాన థియేటర్స్‌కు వస్తారనుకోవడం లేదు’

31 Oct, 2022 12:53 IST|Sakshi

‘‘కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో కొత్త మార్పులు వచ్చాయి. లిప్‌లాక్‌ సీన్స్‌ ఉన్నంత మాత్రాన థియేటర్స్‌కు వస్తారనుకోవడం లేదు. సహజత్వంతో కూడిన వాస్తవిక కథలను చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. వెంటవెంటనే సినిమాలు చేయాలనే తొందర నాకు లేదు.. అందుకే కథ విషయంలో నేను రాజీ పడను’’ అని ‘దండుపాళ్యం’ ఫేమ్‌ దర్శకుడు శ్రీనివాస్‌ రాజు అన్నారు.

నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రాజు మాట్లాడుతూ–‘‘ప్రేమ, ప్రతీకారం మిళితమై ఉన్న కథ ఇది. స్వామిజీల ముసుగులో కొందరు చేసే అక్రమాలు, మనీ లాండరింగ్‌ అంశాన్ని చూపించాం. ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌కు సంబంధించిన ఏపిసోడ్‌ ఈ మూవీలో కీలకంగా ఉంటుంది. మా సినిమాలోని పాత్రలు వేటికవే పోటాపోటీగా ఉంటాయి. అందుకే ‘తగ్గేదే లే’ అని టైటిల్‌ పెట్టాం. మా టైటిల్‌కు మేము ఊహించిన దానికన్నా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు