బెనారస్‌ ఏంటో పాటే చెప్పేస్తోంది

30 Jun, 2022 00:45 IST|Sakshi
తిలక్‌ రాజ్, జైద్‌ ఖాన్, సుకుమార్, సోనాల్, జయతీర్థ

– డైరెక్టర్‌ సుకుమార్‌

‘‘అన్నం ఉడికిందా? లేదా? అని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్లు ‘బెనారస్‌’ మూవీ గురించి ‘మాయ గంగ..’ పాట చెప్పేస్తోంది. పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. జైద్‌ ఖాన్, సోనాల్‌ మోన్‌టైరో జంటగా జయతీర్థ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెనారస్‌’. తిలక్‌ రాజ్‌ బల్లాల్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది.

అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మాయ గంగ..’ అంటూ సాగే పాటను సుకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా తిలక్‌ రాజ్‌ బల్లాల్‌ మాట్లాడుతూ– ‘‘జైద్‌ ఖాన్‌ ఎంతో డెడికేషన్, హార్డ్‌ వర్క్‌తో ఈ సినిమా చేశాడు. ‘పుష్ప’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. జయతీర్థ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడే స్కూల్‌ మానేశాను. అయితే వీధి నాటకాలు వేస్తూ పెరిగాను. సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా మరెవరూ ప్రేమించలేరు. భాష ఏదైనా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు’’ అన్నారు. ‘‘హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది’’ అన్నారు జైద్‌ ఖాన్‌. సోనాల్‌ మోన్‌టైరో, లిరిక్‌ రైటర్‌ కె.కె. మాట్లాడారు.

మరిన్ని వార్తలు