అలాంటి ప్రేమని ఎందుకు చూపించకూడదు?

15 Sep, 2021 10:40 IST|Sakshi

‘‘నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్‌ ఉంటుంది. కానీ వల్గారిటీ ఉండదు. నాకు అవార్డ్స్‌ వచ్చిన ‘సొంత ఊరు, గంగపుత్రులు’ చిత్రాల్లోనూ రొమాన్స్‌ ఉంది. మన తల్లిదండ్రుల ప్రేమకు చిహ్నమే మనం. మరి అలాంటి ప్రేమని తెరపై ఎందుకు చూపించకూడదు?’’ అని దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్‌ ప్రధాన పాత్రల్లో సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనీ ట్రాప్‌’. వీవీ వామనరావు నిర్మింన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘హనీ ట్రాప్‌’ ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ సినిమా. మంచి హ్యమన్‌ ఎవెషన్స్‌ ఉంటాయి. హనీ ట్రాప్‌ గురించి పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. ఈ ట్రాప్‌లో పడి అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. సోషల్‌ మీడియా వల్ల సులభంగా ఇతరులను మోసం చేయొచ్చు. ఇలాంటి అంశాలతో యువతను ఆకర్షించేలా ‘హనీ ట్రాప్‌’ తీశాం. నేను చేసిన ‘వెల్కమ్‌ టు తీహార్‌ కాలేజీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చదలవాడ శ్రీనివాస్‌తో ఓ సినిమా, బాపిరాజుతో మరో చిత్రం చేశాను.. ఇవి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నాయి’’ అని చెప్పారు. 

చదవండి: ఈ సమయంలో మాస్ట్రో అవసరమా అనుకున్నా: నితిన్‌

మరిన్ని వార్తలు