వెబ్‌ సిరీస్‌కి ఆ స్వేచ్ఛ ఉంది: సురేష్‌ కృష్ణ

23 Jun, 2021 11:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: వెబ్‌ సిరీస్‌లపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శక నిర్మాతలు కూడా వెబ్‌ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. దర్శకుడు సురేష్‌ కృష్ణ కూడా వెబ్‌ సిరీస్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టేశారు. రజనీకాంత్‌ నటించిన భాషాతో మంచి పేరు తెచ్చుకున్న ఈయన తమిళం, తెలుగు, మలయాళం, హిందీ తదితర భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలను అందించారు. తరువాత బుల్లితెరపై తన విజయ పరంపరను కొనసాగించారు.

మహాభారతి వంటి ఇతిహాసంతో బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేశారు. తాజాగా వెబ్‌సిరీస్‌పై దృష్టి సారించారు. ఆయన సురేష్‌ కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పతాకంపై ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ పేరుతో తెలుగులో వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

విద్యాసాగర్‌ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఇప్పుడు ఆహా ప్లాట్‌ఫాం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలో తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సీరియల్‌ ఈ సిరీస్‌ను నిర్మించినట్లు తెలిపారు. 40 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి, పలు టీవీ సీరియల్‌ నిర్మించిన సురేష్‌కృష్ణ ఇప్పుడు వెబ్‌సిరీస్‌ రూపొందించడం గురించి మాట్లాడుతూ రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్లుగా రూపొందించే సౌలభ్యం వెబ్‌సిరీస్‌కు ఉందన్నారు. అదే విధంగా సినిమాలు, టీవీ సీరియల్స్‌ను చూపించడంలో లేని స్వేచ్ఛ వెబ్‌సిరీస్‌కు ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి :
ఆ నటుడిని హాఫ్‌ బాయిల్‌ అన్న గూగుల్‌!

మరిన్ని వార్తలు