Teja: నాలుగేళ్లు సినిమాలు ఆపేశా.. నా ఇల్లు జప్తు: డైరెక్టర్ తేజ

21 May, 2023 16:58 IST|Sakshi

హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లలో తేజ ఒకరు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.  ‘సీత’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింస.  చిత్రం సినిమాతో జర్నీ ప్రారంభించిన ఆయన.. ప్రస్తుతం అభిరామ్‌ దగ్గుబాటి హీరోగా తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

(ఇది చదవండి: ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్‌!)

తెలుగులో జయం, నిజం, ఔనన్నా కాదన్నా, లక్ష‍్మీ కల్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.  ఎలాంటి హంగులకు పోకుండా కంటెంట్‌కు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కిస్తే తప్పకుండా అది ప్రేక్షకులకు రీచ్‌ అయ్యే అవకాశం ఉందని అన్నారు. తప్పుల నుంచే తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.. వాటిని ఎప్పటికీ మర్చిపోనని తేజ అన్నారు. 

డైరెక్టర్ తేజ మాట్లాడుతూ.. 'నేను నా ఇంటి సైట్‌ను బ్యాంక్‌లో పెట్టా. మధ్యలో నాలుగేళ్లు సినిమాలు చేయల‍ేదు. బ్యాంక్ వాళ్లు వచ్చి ఈ ఆస్తి జప్తులో ఉందని గేటుకు రాశారు. ఆ తర్వాత అప్పు కట్టేశా. కానీ జీవితంలో మళ్లీ లోన్‌ తీసుకోకూడదని గుర్తు పెట్టుకోవడం కోసం వాళ్లు రాసిన నోటీసు తొలగించకుండా అలాగే ఉంచా. కానీ నా జీవితంలో చేసిన తప్పులు, అవమానాలను గుర్తు పెట్టుకుంటా.  మళ్లీ వాటిని చేయకూడదని నిర్ణయించుకుంటా. నేను చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. సినిమా తీసినప్పుడే హిట్టా, ఫ్లాపా అనేది ముందే తెలుస్తుంది. అందుకే నేను ఏ సినిమాపై ఎలాంటి ఆశలు పెట్టుకోను. సినిమా విషయంలో బడ్జెట్‌ ఉందని ఎలా పడితే అలా చేయకూడదు. కథకు తగిన బడ్జెట్‌లోనే తీయాలి. అంతే కానీ ఉంది కదా అని కథను మించి బడ్జెట్ ఖర్చు పెడితే అంతే ' అని అన్నారు. 

(ఇది చదవండి: లక్షన్నరలో హీరోయిన్‌ వివాహం.. పెళ్లి చీర రూ.3 వేలు మాత్రమేనట!)


 

మరిన్ని వార్తలు