ఏ సినిమా చేసినా అది మిస్సవ్వను

26 Dec, 2021 05:50 IST|Sakshi
తేజ మార్ని

‘‘ప్రతి దర్శకుడికీ తన సినిమాని పెద్ద తెర మీద చూసుకోవాలని ఉంటుంది. అయితే నా మొదటి సినిమా (‘జోహార్‌’) ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాకి నేనే నిర్మాతను కావడంతో ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పుడు ‘అర్జున ఘల్గుణ’కి మంచి నిర్మాతలు దొరికారు. ‘దిల్‌’ రాజుగారు రిలీజ్‌ చేస్తున్నారు’’ అని తేజ మార్ని అన్నారు. శ్రీ విష్ణు, అమృతా అయ్యర్‌ జంటగా తేజ మార్ని దర్శకత్వంలో ఎన్‌.ఎమ్‌. పాషా కో ప్రొడ్యూసర్‌గా నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్‌ కానున్న సందర్భంగా తేజ మార్ని చెప్పిన విశేషాలు.

► ‘అర్జుణ ఫల్గుణ’ని సంక్రాంతికి రిలీజ్‌ చేద్దామనుకున్నాం. ఇందులో ఎన్టీఆర్, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మీద డైలాగ్స్‌ ఉన్నాయి. పైగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ (జనవరి 7) తర్వాత వేరే సినిమాలు కనపడవేమో! ఈ కారణాల వల్ల మా సినిమాని ముందు రిలీజ్‌ చేస్తున్నాం.

► గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. ఈస్ట్‌ గోదావరిలో దొరికే ఓ కూల్‌ డ్రింక్‌ని టైటిల్‌గా అనుకుంటే, అనుమతి దక్కలేదు. ఆ టైటిల్‌ కాకపోతే కథ మార్చాలి. ఆ విషయం గురించి చర్చించుకుంటున్నప్పుడు అర్జున ఫల్గుణ అంటే ధైర్యం వస్తుందట అని నేను, శ్రీవిష్ణు  మాట్లాడుకున్నాం. ఇదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని శ్రీవిష్ణు అన్నారు. సినిమాలో హీరో పేరు అర్జున్‌. టైటిల్‌ పెట్టాక కథలో చాలా మార్పులు చేశాం. ఉళ్లో ఉన్నప్పుడు అర్జునుడిగా ఉండే హీరో ఊరు దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడు? అన్నదే కథ.

► సిటీలో ఎంత సంపాదించుకున్నా మిగిలేది కొంతే.. ఒక్కోసారి మిగలకపోవచ్చు కూడా. అందుకే ఊళ్లోనే ఉండి సంపాదించుకుంటే మంచిదేమో అనుకునే ఊరి కుర్రాళ్ల కథ ఇది. నా స్నేహితులు, వాళ్ల స్నేహితుల జీవితాల్లో జరిగిన ఘటనలను ఈ కథలో పొందుపరిచాను. సినిమాలోని మెయిన్‌ ఐదు పాత్రలూ ఎన్టీఆర్‌ ఫ్యా¯Œ ్స. నేను కూడా ఎన్టీఆర్‌ అభిమానినే.

► శ్రీ విష్ణుని అనుకుని ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు కథ రాశాను.   కథానుగుణంగా గోదావరి యాస పెట్టాం. సినిమాలో శ్రీవిష్ణుని చూస్తే ‘సిందూరం’లో రవితేజగారిని చూసిన ఫీల్‌ వస్తుంది. యాక్షన్‌ పరంగా కొత్త విష్ణును చూస్తారు. సినిమా ఫస్టాఫ్‌ వినోదంగా, సెకం డాఫ్‌ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో ప్రేక్షకులు ఎమోషనల్‌ అవుతారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ 2, షైన్‌ స్క్రీన్‌ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాను. ఇకనుంచి కమర్షియల్‌ సినిమాలే చేయాలనుకుంటున్నాను. కానీ ఎమోషన్‌ని మాత్రం మిస్సవ్వను. 

మరిన్ని వార్తలు