ప్రేమ మెరిసే

20 Sep, 2020 05:56 IST|Sakshi
దినేష్‌ తేజ్, ‌ శ్వేతా అవస్తీ

‘హుషారు’ ఫేమ్‌ దినేష్‌ తేజ్‌ హీరోగా, శ్వేతా అవస్తి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌ కుమార్‌.కె దర్శకత్వంలో వెంకటేష్‌ కొత్తూరి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌. కె మాట్లాడుతూ– ‘‘కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన చిత్రమిది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్‌ బన్నెల్, సంగీతం: కార్తీక్‌ కొడగండ్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు