డ్యాన్సర్‌ అక్సాఖాన్‌ హీరోయిన్‌గా 'క్షణం ఒక యుగం'.. పోస్టర్‌ రిలీజ్‌

11 Jan, 2023 17:27 IST|Sakshi

యంగ్‌స్టర్స్‌ నటించిన క్షణం ఒక యుగం సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను బ్లాక్‌ బస్టర్‌ మూవీ ధమాకా డైరెక్టర్‌ నక్కిన త్రినాథరావు గ్రాండ్‌గా విడుదల చేశారు. శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించారు. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ''సినిమా స్టోరీ నాకు చెప్పారు.

చాలా నచ్చింది. అందుకే పోస్టర్‌ రిలీజ్‌ చేయడానికి వచ్చాను. కథ చాలా డిఫరెంట్‌గా ఉంది. సినిమా మంచి సక్సెస్‌ అ‍వ్వాలని కోరుకుంటున్నా'' అంటూ ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు. ఇక నటి అక్సాఖాన్‌ మాట్లాడుతూ.. పోస్టర్‌ లాంచ్‌ చేసినందుకు డైరెక్టర్‌ త్రినాథరావుకు ధన్యవాదాలు తెలిపింది. సినిమాకు కూడా బ్లెస్సింగ్స్‌ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు