వ్యవసాయం లాభసాటిగా మారాలి

27 Feb, 2021 01:08 IST|Sakshi
గోపీ ఆచంట, కిషోర్, త్రివిక్రమ్, రామ్‌ ఆచంట

– దర్శకుడు త్రివిక్రమ్‌

‘‘జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. అలాంటప్పుడు వ్యవ సాయం లాభసాటిగా మారాలి కానీ, నష్టాల్లో కూరుకుపోతోంది. దానికి పరిష్కారం చెప్పడానికి ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు కిషోర్‌. ఈ చిత్రకథ ఆసక్తికరంగా ఉంది’’ అని డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అన్నారు. శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ బి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకారం’. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజ్‌ కానుంది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించిన ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ని త్రివిక్రమ్‌ విడుదల చేశారు.‘‘నాలుగేళ్ల క్రితం షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను. ‘శ్రీకారం’తో ఫ్యూచర్‌ ఫిల్మ్‌ చేశాను. ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు బి. కిషోర్‌. ‘‘అత్యధిక థియేటర్స్‌లలో గ్రాండ్‌గా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు రామ్‌ ఆచంట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు