Venkatesh Maha: కేజీయఫ్‌ వివాదంపై స్పందించిన డైరెక్టర్‌, తగ్గేదే లే అంటూనే క్షమాపణలు..

7 Mar, 2023 09:49 IST|Sakshi

‘కేరాఫ్‌ కంచెరపాలెం’ దర్శకుడు వెంకటేశ్‌ మహా కేజీయఫ్‌ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. సినిమా పేరు చెప్పకుండా స్టోరీ చెబుతూ సెటైర్లు వేశాడు. దీంతో అతడిపై కామెంట్స్‌పై కేజీయఫ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. హీరో యశ్‌, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌కు క్షమాపణలు చెప్పాలంటూ కన్నడ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వెంకటేశ్‌ మహాకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. ఇక తనపై వస్తున్న తీవ్ర నెగిటివిటీ, ట్రోల్స్‌కి వెంకటేశ్‌ మహా స్పందించాడు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాజాగా ఓ వీడియో షేర్‌ చేశాడు.

చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్‌ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా?

క్షమాపణలకు బదులుగా తన కామెంట్స్‌ని సమర్థించుకోవడం గమనార్హం. తన అభిప్రాయం సరైనదే అని అయితే తాను వాడిన భాష కరెక్ట్‌ కాదన్నాడు. ఇంతకీ వెంకటేశ్‌ మహా ఈ వీడియో ఏం చెప్పాడంటే.. ‘‘కొంతమందిని ఉద్దేశించే నా అభిప్రాయం చెప్పాను. నాలాగే చాలామంది ఆ సినిమా నచ్చలేదు. నా అభిప్రాయం నచ్చినవాళ్లు ‘మీరు చెప్పింది కరెక్ట్‌ సార్‌’ అంటూ నాకు మెసెజ్‌లు పెట్టారు. కాబట్టి వారందరి తరపున నా వాయిస్‌ వినిపించాను. అయితే ఈ క్రమంలో నేను వాడిన పద భాష కరెక్ట్‌ కాదు. దానికి నా క్షమాపణలు. కానీ, నేను సినిమాలోని కల్పిత పాత్రను మాత్రమే విమర్శించాను. రియల్‌ పర్సన్‌ కాదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: ట్రెండింగ్‌లో అల్లు అర్జున్‌-స్నేహల ఫొటో! స్పెషల్‌ ఏంటంటే..

అనంతరం మాట్లాడుతూ.. ‘తాను దూషించింది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే. కానీ రియల్‌ పర్సన్‌ అయినా నన్ను దూషించడం ఎంతవరకు కెరెక్ట్‌. నాపై తప్పుడు ఇమేజ్‌ క్రియేట్‌ చేస్తూ అసభ్యంగా దూషిస్తున్నారు. ఇదేం నాకు కొత్త కాదు. చాలా సార్లు ఇలాంటివి ఎదుర్కొన్నాను. అయితే మీరంత అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని, ఒకేలా చూస్తారని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ మరోసారి వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల  ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ మహా ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ, నందిని రెడ్డి, శివ నిర్వాణ, వివేక్‌ ఆత్రేయలతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వారి సమక్షంలోనే ఈ మూవీ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనికి వారంత నవ్వడం యశ్‌ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో నందిని రెడ్డిని కొందరు ప్రశ్నించగా ఆమె ట్విటర్‌ వేదికగా క్షమాపణలు కోరారు. 

మరిన్ని వార్తలు