Venky Atluri Marriage: ప్రముఖ దర్శకుడి పెళ్లి, సందడి చేసిన తారలు

1 Feb, 2023 13:10 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యాడు. పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి హీరో నితిన్‌ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు. అలాగే హీరోయిన్‌ కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ వెంకీ కుడుముల సైతం ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వార్తను నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న వెంకీకి శుభాకాంక్షలు. వెంకీ- పూజ.. ఆనందకరమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని నితిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. వెంకీ పెళ్లికి హాజరైన ఫోటోను దీనికి జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా వెంకీ అట్లూరి.. రంగ్‌దే, మిస్టర్‌ మజ్ను, తొలి ప్రేమ వంటి చిత్రాలను తెరకెక్కించి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం అతడు ధనుష్‌తో సార్‌ అనే సినిమా చేస్తున్నాడు.

A post shared by N I T H I I N (@actor_nithiin)

మరిన్ని వార్తలు