కొత్త యాంగిల్‌ చూస్తారు

2 Mar, 2021 00:16 IST|Sakshi
రాజ్‌ తరుణ్, పూర్ణ, విజయ్‌కుమార్‌

– విజయ్‌ కుమార్‌

‘‘పవర్‌ ప్లే’ ట్రైలర్‌ చూశాక కొండా విజయ్‌కుమార్‌ ఆలోచనలు మారిపోయాయనిపించింది. రాజ్‌ తరుణ్‌తో ఇలాంటి ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చేయడం గొప్ప విషయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత కేఎస్‌ రామారావు. రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వంలో మహిధర్, దేవేష్‌ నిర్మించిన ‘పవర్‌ ప్లే’ ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలంగాణ టూరిజం చైర్మన్‌  ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, నిర్మాతలు కేస్‌ రామారావు, కేకే రాధామోహన్‌  ‘పవర్‌ ప్లే’ బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు.

ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ– ‘‘రాజ్‌తరుణ్‌ నటించిన ‘ఉయ్యాల జంపాల’ చూసి అతనికి మంచి భవిష్యత్‌ ఉందనుకున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రోమోస్, ట్రైలర్స్‌ చూస్తుంటే రాజ్‌తరుణ్‌ రఫ్‌ అయ్యాడనిపిస్తోంది. సినిమా హిట్‌ అయి, మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు నిర్మాత రాధామోహన్‌ . ‘‘పవర్‌ ప్లే’ సినిమా ఆడియన్స్‌ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాజ్‌తరుణ్‌. ‘‘నేను, రాజ్‌ ఇప్పటివరకు చేయని కొత్త జానర్‌ సినిమా ఇది.  ఫస్ట్‌ టైమ్‌ తనలో మరో యాంగిల్‌ చూస్తారు’’ అన్నారు విజయ్‌కుమార్‌. ‘‘ట్రైలర్‌ బాగుంది. సినిమా బంపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు తాండూరి ఎమ్‌ఎల్‌ఏ రోహిత్‌ రెడ్డి. హీరోయిన్‌  పూర్ణ, సినిమాటోగ్రఫర్‌ ఐ. ఆండ్రూ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పాలపర్తి ఆనంత్‌ సాయి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు